గత 24 గంటల్లో నెల్లూరులో అత్యధిక వర్షపాతం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- అక్టోబరు 24 వరకు వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెల్లడి
- కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన
అల్పపీడన ప్రభావంతో అక్టోబరు 24 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. రానున్న రెండుమూడు రోజుల్లో నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని స్కైమెట్ తెలిపింది.