రక్తమోడిన ఏపీ, తెలంగాణ రోడ్లు.. ఆరుగురి దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు
- కడపలో కారును ఢీకొన్న లారీ
- సిద్దిపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
- విజయవాడలో బోల్తాపడిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డు పడవల జంక్షన్ వద్ద జరిగిన మరో ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
తెలంగాణలోని సిద్దిపేటలో జరిగిన ఇంకో ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందిన మల్లేశం, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్‌రెడ్డిలుగా గుర్తించారు.