మళ్లీ అదే కథ... రాంచీ టెస్టులో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, కష్టాల్లో సఫారీలు
- రోహిత్ శర్మ డబుల్, రహానే సెంచరీ
- తొలి ఇన్నింగ్స్ 497/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్
- 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సఫారీలు
- వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయిన మ్యాచ్
టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరగడంతో సఫారీలు 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయారు. ఎల్గార్ (0) డకౌట్ కాగా, డికాక్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జుబేర్ హంజా, కెప్టెన్ డుప్లెసిస్ ఆడుతున్నారు. మూడు టెస్టుల ఈ సిరీస్ లో సఫారీలు ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ ఓటమిపాలయ్యారు. పరిస్థితి చూస్తుంటే రాంచీలోనూ ఓటమి తప్పేట్టు కనిపించడంలేదు. అయితే, వెలుతురు లేమి కారణంగా రాంచీలో మ్యాచ్ నిలిచిపోయింది.