Telangana: రేపటి నుంచి మళ్లీ బడులు కళకళ.. సుదీర్ఘ సెలవుల తర్వాత తెరుచుకోనున్న బడులు

  • 23 రోజులపాటు మూతబడిన విద్యాసంస్థలు
  • ఆర్టీసీ సమ్మె కారణంగా అదనంగా ఐదు రోజుల సెలవులు 
  • కాలేజీలు సహా విద్యాసంస్థలన్నీ రేపటి నుంచి  ప్రారంభం

దసరా సెలవులు, ఆపై ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా వరుసగా 23 రోజులపాటు మూతబడిన విద్యాసంస్థలు రేపు పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాకమిషనర్ టి.విజయ్‌కుమార్ తెలిపారు. గత నెల 28న తెలంగాణలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న బడులు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా, ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను ఈ నెల 19 వరకు ప్రభుత్వం పొడిగించింది. అయితే, 20 ఆదివారం కావడంతో 21న (సోమవారం) పునఃప్రారంభం కానున్నాయి.

మరోవైపు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు కూడా రేపటి నుంచే ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.

More Telugu News