ఈ నెల 22న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె
- బ్యాంకుల విలీనంపై వ్యతిరేకత
- సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు
- ఉపాధి పోతుంది, ఉద్యోగ భద్రత ఉండదన్న సంఘాలు
కాగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. కాగా, విజయవాడలో ఆంధ్రా బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనం ఆపాలని, ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.