జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం.. పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం
- ఆటో డ్రైవర్ల సభకు హాజరైన రాపాక
- వారితో కలిసి జగన్ ఫొటోకు పాలాభిషేకం
- పార్టీ మార్పు వార్తలను నమ్మొద్దన్న జనసేన ఎమ్మెల్యే
అంతే, ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆయన పార్టీ మారబోతున్నారని, అందుకు ఈ ఫొటోనే నిదర్శనమంటూ వార్తల హోరు మొదలైంది. దీంతో రాపాక స్పందించక తప్పలేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని, నమ్మొద్దని కోరారు. తనను నమ్మి అధినేత పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే, అభిమానులు, జనసైనికులు కష్టపడి తన గెలుపునకు కృషి చేశారని, వారిని వంచించబోనని స్పష్టం చేస్తూ తన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.