గంగూలీ క్రికెట్ ఎలా ఆడాడో బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా అలాగే పనిచేస్తాడు: సచిన్
- బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ
- త్వరలో బాధ్యతల స్వీకరణ
- మనస్ఫూర్తిగా స్వాగతించిన సచిన్
గంగూలీ ఎంతో తపనతో, అభిరుచితో క్రికెట్ ఆడాడని, ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగానూ అదే అంకితభావం కనబరుస్తాడని భావిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా విశేషంగా సేవలందించాడని, కొత్త బాధ్యతల్లోనూ అదే సమర్థత కనబరుస్తాడనడంలో తనకెలాంటి సందేహం లేదని అన్నారు.