ఏపీ కేబినెట్ కీలక భేటీ నేడు: ఎజెండాలో పలు అంశాలు
- ఉదయం 10 గంటల తర్వాత సమావేశం
- చేనేత కార్మిక కుటుంబాలకు సాయంపై ప్రధానంగా చర్చ
- పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం
మత్స్యకారుల సంక్షేమం, డ్వాక్రా మహిళ కోసం వైఎస్సార్ క్రాంతి పథకం, ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే వివాదాస్పదంగా ఉన్న పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.