Sensex: వరుసగా మూడో రోజు లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 38,506కి చేరుకుంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 11,428కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (3.79%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.83%), ఓఎన్జీసీ (2.63%), హీరో మోటోకార్ప్ (2.63%), మారుతి సుజుకి (2.47%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.27%), భారతి ఎయిర్ టెల్ (-2.53%), టాటా మోటార్స్ (-0.67%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.27%), టెక్ మహీంద్రా (-0.07%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News