పాములను పట్టుకుని అమ్మాయిల డ్యాన్స్.. కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాములను పట్టుకుని అమ్మాయిల డ్యాన్స్.. కేసు నమోదు

  • గుజరాత్ లో ఘటన
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్
  • 12 ఏళ్ల బాలిక సహా ముగ్గురి అరెస్ట్
ఓ వేడుకలో కొందరు యువతులు పాములను పట్టుకుని గార్బా డ్యాన్స్ చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై, చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో 12 ఏళ్ల బాలిక సహా ముగ్గురు డ్యాన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వేదికపై నించొని తమ రెండు చేతులతో తాచుపాములను పట్టుకుని వారంతా డ్యాన్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి ఓ చేతితో పాము, మరో చేతితో కత్తి పట్టుకొని కనపడిందని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
 
ఆ వేడుకకు వచ్చిన వారికి వినోదం అందంచడానికి పాము తోకలు పట్టుకుని ఆ యువతులు ఈ చర్యకు పాల్పడ్డారు. వారి చేతుల్లోంచి ఆ పాములు వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తూ కనపడ్డాయి. అదే సమయంలో యువతులు వేదికపై గార్బా డ్యాన్సులనూ కొనసాగించారు. వారికి ఆ పాములను తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసు నమోదైంది. అరెస్టు చేసిన 12 బాలికను జువెనైల్ కోర్టుకు పంపామని పోలీసులు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆ యువతులపై కేసు నమోదు చేశారు.
snake
Gujarat
dance

More Telugu News