జపాన్ ను హడలెత్తిస్తున్న 'హగిబిస్' టైఫూన్
- 1958 తర్వాత జపాన్ కు అతిపెద్ద ముప్పు
- ఇప్పటికే మొదలైన హగిబిస్ బీభత్సం
- భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు
కేటగిరీ 5 టైఫూన్ గా కొనసాగుతున్న హగిబిస్ ధాటికి జపాన్ తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 195 మైళ్లకు మించి వేగంతో పెనుగాలులు వీస్తుండగా, కుండపోత వర్షంతో వరదలు ముంచెత్తుతున్నాయి. టోక్యో, పరిసర ప్రాంతాల్లో 800 మిమీ వర్షపాతం నమోదవ్వొచ్చన్నది స్థానిక వాతావరణ సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ భయంతో జపనీయులు ముందుగానే నిత్యావసరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో డిపార్ట్ మెంటల్ స్టోర్లు బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి.