హిందీ బిగ్ బాస్ లో 'షేమ్ షేమ్' దృశ్యం!

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 13 ఎంతో ఆకర్షణీయంగా, ఎన్నో వివాదాలకు కేంద్రంగా సాగుతోంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ఇక తాజా ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కోయినా మిత్ర అత్యంత ఇబ్బందికరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. మరో కంటెస్టెంట్ సిద్ధార్థ డే, స్నానం చేయడానికి బాత్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకోలేదు. ఈ విషయం తెలియని కోయినా నేరుగా డోర్ తెరచుకుని లోపలికి వెళ్లబోయింది.

ఆపై ఇంకేముంది... ఈ హఠాత్పరిణామంతో ఇద్దరూ గట్టిగా కేకలు వేశారు. ఇతర కంటెస్టెంట్ లు పరాస్ చాబ్రా, మహీరా శర్మలు పరుగున వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. కాసేపు షాక్ లోనే ఉండిపోయిన కోయినా మిత్ర తర్వాత విషయం చెప్పేసరికి, నవ్వులు విరబూశాయి. అనుకోకుండా జరిగిందని, పదే పదే గుర్తు చేయవద్దని చెప్పుకొచ్చింది. ఇక సిద్ధార్థ్ బయటకు రాగానే అందరూ షేమ్ షేమ్ అంటూ పాటలు పాడి అతన్ని ఆట పట్టించే పనిలో పడ్డారు.
Go Back to Shorts
Bigg Boss
Bollywood
Salman Khan

More Telugu News