Sensex: వారాంతాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 465 పాయింట్ల వరకు ఎగబాకింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ స్టాకుల అండతో భారీ లాభాల్లోకి వెళ్లాయి. అయితే ఐటీ, ఫార్మా స్టాకులు నష్టాల్లోకి జారుకోవడంతో... లాభాలు కొంత మేర తగ్గిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి 38,127కి పెరిగింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుని 11,305 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (4.19%), వేదాంత లిమిటెడ్ (3.96%), టాటా మోటార్స్ (3.81%), ఓఎన్జీసీ (2.95%), టాటా స్టీల్ (2.94%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.96%), టీసీఎస్ (-0.87%), హీరో మోటో కార్ప్ (-0.46%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News