రెండు నెలల తర్వాత టూరిస్టుల కోసం తెరుచుకున్న జమ్మూకశ్మీర్ తలుపులు
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్న కేంద్రం
- ఇతరులు ఆ రాష్ట్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు
- ఈరోజు నుంచి టూరిస్టులను అనుమతిస్తూ ఉత్తర్వుల జారీ
జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సూచనల మేరకు పర్యాటకులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆ రాష్ట్ర హోం శాఖ నిన్న ఉత్తర్వులను జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లో పర్యటించాలనుకుంటున్న టూరిస్టులకు అవసరమైన సహాయసహకారాలను పూర్తిగా అందిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.