ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీలకు సిగ్గుండాలి: ఎర్రబెల్లి ధ్వజం
- స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యలు
- దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడి
- ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆర్టీసీ కార్మికులకు హితవు
అసలు, ఆర్టీసీలో సమ్మె జరగడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ వైఖరేనని ఆరోపించారు. సమ్మెకు మద్దతివ్వడానికి ఆ రెండు పార్టీలకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. అయినా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అంటూ ప్రశ్నించారు.