సైరాను మించిన సినిమా రాదనే అనుకుంటున్నా, వస్తే అదృష్టవంతుడ్నే: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి మళ్లీ చిత్ర రంగం వైపు వచ్చిన తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిందే సైరా నరసింహారెడ్డి. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా సైరా సక్సెస్ మీట్ ను చిత్రబృందం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ, తన కెరీర్ లో నిస్సందేహంగా సైరా మూవీకే నెంబర్ వన్ స్థానం ఇస్తానని స్పష్టం చేశారు.

అయితే సైరాను మించిన సినిమా తన కెరీర్ లో మళ్లీ రావాలి, కావాలి అనుకోవడం అత్యాశ అవుతుందని, సైరాకు దీటైన సినిమా తనకు మళ్లీ రాదనే భావిస్తున్నానని, ఒకవేళ వస్తే తనంతటి అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని అన్నారు. భవిష్యత్ లో భగత్ సింగ్ వంటి వీరుడి కథను తెరకెక్కించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చిరు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Sye Raa Narasimha Reddy
Tollywood

More Telugu News