పాఠశాల వార్షికోత్సవంలో పోల్ డ్యాన్స్... వికటించిన వినోదం.. వీడియో ఇదిగో!
- యూఎస్ లోని కన్సాస్ లో ఘటన
- డబ్బులు వెదజల్లిన దృశ్యాలు వైరల్
- క్షమాపణ చెప్పిన కన్సాస్ అధికారులు
అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఈ వేడుకల కోసం సదరు స్కూల్ ఇచ్చిన కార్యక్రమాల జాబితా తొలుత అందరికీ నచ్చింది. వాటిని చక్కగా ప్రదర్శించారు కూడా. అందులో పోల్ డ్యాన్స్, డబ్బులను వెదజల్లే మనీ గన్ పై మాత్రం విమర్శలు వచ్చాయి.
ఓ యువతి స్టేజ్ పై పోల్ డ్యాన్స్ చేస్తుండగా, మరో యువతి, మనీ గన్ తీసుకుని, స్టేజ్ నలువైపులా తిరుగుతూ డబ్బులను వెదజల్లడం, కరెన్సీ కాగితాలను అందుకునేందుకు వీక్షకులు ఎగబడడం.. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ స్నూప్ డాగ్ ప్రదర్శనకు తాము చింతిస్తున్నామని, తాము కేవలం వినోదం కోసమే కార్యక్రమాన్ని రూపొందించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్సాస్ అథ్లెటిక్ విభాగం క్షమాపణలు చెప్పింది. పోల్ డ్యాన్స్, మనీ గన్ వీడియోను మీరూ చూడవచ్చు.