Akhilapriya: 3000 టన్నుల మట్టి తీస్తే కిలో యురేనియం మాత్రమే వస్తుంది: అఖిలప్రియ వెల్లడి

  • బహిరంగ సభ నిర్వహించిన అఖిలపక్షం
  • యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటన
  • సీఎం నియోజకర్గ ప్రజలకే రక్షణ లేదన్న అఖిలప్రియ

ఏపీలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లెలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలవ శ్రీనివాసులు, అఖిల ప్రియ, కోట్ల సుజాతమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటించామని వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నామని, సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు రక్షణ లేదని అన్నారు.

యురేనియం దుష్ప్రభావాల కారణంగా కేకే కొట్టాల ప్రాంతంలో ప్రజలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయని, పంటలు కూడా పండడంలేదని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డ మండలంలో యురేనియం తవ్వకాలను అడ్డుకున్నామని ఆమె వెల్లడించారు. 3000 టన్నుల మట్టి వెలికితీస్తే అందులో యురేనియం లభ్యత ఒక కిలో మాత్రమేనని వివరించారు. యురేనియం తవ్వకాలపై పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

More Telugu News