బాహుబలి చిత్రానికి ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం... ఆగలేకపోతున్నామని రాజమౌళి ట్వీట్
- రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా దృష్టిలో పడిన బాహుబలి
- రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కార్యక్రమం
- అక్టోబరు 19న బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కచేరీ
ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల సినిమాలను ఇక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ లో పెర్ఫామ్ చేయనుండడం ఇదే ప్రథమం. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. అక్టోబరు 19న బాహుబలి ద బిగినింగ్ చిత్రం నేపథ్య సంగీతాన్ని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా సభ్యులు లైవ్ ప్రదర్శన ఇస్తున్నారని, ఈ ప్రదర్శన కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నామని రాజమౌళి ట్వీట్ చేశారు.