జనసేనకు గుడ్ బై చెప్పే యోచనలో ఆకుల...త్వరలో వైసీపీలోకి
- 2014లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపు
- ఎన్నికల ముందు బీజేపీని వీడి జనసేనలోకి
- రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి
అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్టు వుంటున్న ఆయన, ఇప్పుడు అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలే జనసేనకు రావెల కిశోర్‌బాబు రాంరాం చెప్పేశారు. తాజాగా ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ వీడనుండడం ఆ పార్టీకి గట్టి షాకే.