ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్
- సోదాలు జరుపుతున్న అధికారులు
- భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం
- భార్యతోపాటు పలువురు బినామీలు
బెంగళూరులో అపార్ట్‌మెంట్‌తోపాటు హైదరాబాద్‌లో మరో భవనం కూడా ఉన్నట్లు లెక్క తేల్చారు. కర్నూల్‌లోని ఇంట్లో కేజీకిపైగా బంగారాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఉగాండా దేశంలో బ్యాంక్ అకౌంట్, హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు.
అలాగే, భార్య పేరు మీదు శివప్రసాద్ రెండు సూట్ కేసు కంపెనీలను నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది. అక్రమాస్తుల చిట్టా భారీగా ఉండడంతో సాయంత్రం వరకు సోదాలు సాగే అవకాశం ఉంది.