బీహార్ డిప్యూటీ సీఎంను ఇంటి నుంచి బోటులో తరలించిన సహాయక సిబ్బంది!
- ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు
- యూపీలో 111, బీహార్ లో 27 మంది మృత్యువాత
- సుశీల్ మోదీని బోటులో తరలించిన సహాయక సిబ్బంది
బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ఇంట్లోకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో, ఆయనను, కుటుంబసభ్యులను సహాయక సిబ్బంది బోటులో తరలించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లో గంగానదికి సమీపంలో ఉండే బల్లియా జిల్లా జైలును వరద ముంచెత్తడంతో... జైల్లోని 900 మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు.