నంబర్ కేటాయించలేదని ఆటోకి నిప్పంటించి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన
- అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఘటన
- నంబర్ ఇవ్వకుండా ఉపాధి తీసేసారని డ్రైవర్ ధ్వజం
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
పోలీసుల కథనం మేరకు...పుట్టపర్తి పట్టణంలో తిరిగేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హయాంలో 150 ఆటోలకు నంబర్లు ఇచ్చారు. అలా నంబర్లు ఇచ్చిన ఆ ఆటోలన్నింటికీ తాజాగా నంబర్లు ఇవ్వలేదని నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ ఆరోపించాడు.
ఆటో నడుపుకొంటూ జీవనోపాధి పొందుతున్న తాము దీనివల్ల రోడ్డున పడ్డామని ధ్వజమెత్తాడు. తమ ఆకలి కేకలు తెలియాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.