Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై అపరిశుభ్ర వాతావరణంలో పులిహోర ప్రసాదం తయారీ!

షార్ట్స్‌లో చూడండి
దేవాలయానికి వెళ్లినప్పుడు ప్రసాదం తీసుకోవడం సర్వసాధారణం. ఈ ప్రసాదానికి ఎంతో పవిత్రత ఉంది. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ ఆలయంలో తయారవుతున్న పులిహోర ప్రసాదంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. భక్తులకు పంచాల్సిన పులిహోరను అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేతులకు ఎలాంటి తొడుగులు లేకుండా చమటలు కక్కుతూ కొన్నిసార్లు పులిహోర కాళ్లకింద పడుతున్నా పట్టించుకోకుండా అలాగే తయారుచేస్తున్నట్టు భక్తులు మండిపడుతున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రసాదం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Vijayawada
Temple

More Telugu News