‘గుడ్‌మ్యాన్’ బ్యాడ్ పని.. లైవ్‌లో రిపోర్టు చేస్తున్న మహిళా జర్నలిస్టును ముద్దాడి పరార్!
- ‘వేవ్ 3’ న్యూస్ చానల్ రిపోర్టర్‌కు చేదు అనుభవం
- ఆగంతకుడి చర్యతో క్షణకాలం షాక్
- నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు
ఈ క్రమంలో ఆమె వెనక నుంచి వెళ్లిన ఓ యువకుడు కాసేపటి తర్వాత ఒక్కసారిగా వచ్చి ఆమె బుగ్గపై ముద్దుపెట్టి తుర్రుమన్నాడు. అతడి చర్యకు క్షణకాలంపాటు బిత్తరపోయిన సారా.. వార్తలు అందించడం మాత్రం మానలేదు. అనంతరం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ‘గుడ్‌మ్యాన్’గా గుర్తించిన పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. రిపోర్టర్‌కు ముద్దుపెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.