Andhra Pradesh: పీపీఏలపై పున:సమీక్ష సరికాదు.. ఏపీకి మరోమారు లేఖ రాసిన కేంద్రం!

  • ప్రధానికి సీఎం జగన్ ఇటీవల లేఖ
  • ఈ లేఖను ఇంధన శాఖకు పంపిన పీఎంఓ
  • పీపీఏలపై పున: సమీక్షించాల్సిన అవసరం లేదు: మంత్రి ఆర్కే సింగ్

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై పున:సమీక్ష సరికాదంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం హయాంలో పీపీఏలలో అక్రమాలు జరగడం వల్లే పున:సమీక్ష చేయాలన్న నిర్ణయం తీసుకున్నామంటూ ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇటీవల ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

 ఈ లేఖను ఇంధన శాఖకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) పంపించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్  ఓ లేఖ రాశారు. ఆయా విద్యుత్ సంస్థలతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించామని అన్నారు.

2016-17లో ఏపీలో యూనిట్ విద్యుత్ ధర రూ.4.84, రాజస్థాన్ లో రూ.5.76, మహారాష్ట్రలో రూ.5.56, మధ్యప్రదేశ్ లో రూ.4,78 గా నిర్ణయించారని వివరించారు. ఏపీతో పోలిస్తే ఈ మూడు పెద్ద రాష్ట్రాల్లో ధర అధికంగానే ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్ పథకం ప్రకారం విద్యుత్ ధరలు పెంచాల్సి ఉందని, అప్పుడు పెంచకపోవడం వల్ల డిస్కంలకు నష్టాలు వచ్చాయని ఈ లేఖలో తెలిపారు. పీపీఏలపై పున: సమీక్ష నిర్ణయం దేశ విద్యుత్ రంగ విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

More Telugu News