‘అయ్యా, తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ..’ అంటూ జగన్ పై లోకేశ్ విమర్శలు
- ‘పోలవరం’లో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచారు
- ఇది రివర్స్ టెండర్ వెనక ఉన్న అసలైన మేజిక్
- ‘పోలవరం’ నిర్మాణాన్ని అనుభవంలేని కంపెనీకి అప్పగిస్తారా!
పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎటువంటి అనుభవంలేని కంపెనీకి అప్పగించడం తగదని, ఆ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం అని అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ గేటుకు అడ్డంగా బోటు పడితే తీయడానికి వారం రోజులు పట్టిందని, గోదావరిలో మునిగిన బోటును రెండు వారాలుగా తీయలేక, 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు.