Chandrababu: జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిది?: సర్కారును నిలదీసిన చంద్రబాబు

  • ఇసుక అంశంపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు
  • 20 లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయంటూ వ్యాఖ్యలు
  • ఇసుక రేటు నాలుగైదు రెట్లు పెరిగిందన్న మాజీ సీఎం

ఇసుక లేక రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు మందగించాయని, లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అస్తవ్యస్తంగా ఉన్న విధానాల కారణంగా 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇసుక సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే, అనంతపురం మీదుగా కర్ణాటకకు తరలిపోతున్న ఇసుక ఎవరిది? జగ్గయ్యపేట మీదుగా తెలంగాణకు తరలిపోతున్న ఇసుక ఎవరిది? అంటూ నిలదీశారు.

ఇసుక రేట్లను కూడా అడ్డగోలుగా పెంచేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక రేటెంత, వైసీపీ వచ్చాక ఎంత పెరిగింది? అని ప్రశ్నించారు. నాలుగు నెలల్లోనే ఇసుక రేటు నాలుగైదు రెట్లు పెరిగింది, పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? అంటూ మండిపడ్డారు.

More Telugu News