డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంకు ఖాతా వరకు.. అన్నింటికీ ఇక ఒకటే కార్డు: అమిత్ షా
- ఒకే దేశం-ఒకే కార్డు దిశగా కేంద్రం
- తొలిసారి పేపర్ ఉపయోగించకుండా జన గణన
- మొబైల్ యాప్ ద్వారా కుటుంబ వివరాల నమోదు
భారత రిజిస్ట్రార్ జనరల్/జనగణన కమిషన్ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన అనంతరం షా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ దిశగా చర్యలు ప్రారంభమైనదీ, లేనిదీ వెల్లడించలేదు. బహుళ ప్రయోజనకార్డు వలన చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈసారి జనాభా లెక్కలను మొబైల్ యాప్‌తో నిర్వహిస్తున్నట్టు చెప్పిన షా.. తొలిసారి కలం, కాగితం అవసరం లేకుండా జనాభాను లెక్కిస్తున్నట్టు తెలిపారు. కొత్త మొబైల్ యాప్‌లో ఎవరైనా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.