అత్యంత ప్రమాదకరమైన 10 వేల యాప్స్ ను తొలగించిన ఫేస్‌బుక్
- కేంబ్రిడ్జి అనలిటికా కేసులో భారీ జరిమానాకు గురైన ఫేస్‌బుక్
- 400 మంది డెవలపర్లకు చెందిన 10 వేల యాప్స్ తొలగింపు
- అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్ కూడా తొలగింపు
గతేడాది వెలుగుచూసిన కేంబ్రిడ్జి అనలిటికా వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ చర్యలు చేపట్టింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం యాప్ డెవలపర్స్‌కు తెలిసే అవకాశం ఉన్న అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్‌ను కూడా తొలగించినట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. కేంబ్రిడ్జి అనలిటికా కేసులో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఫేస్‌బుక్‌కు ఐదు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.