గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ చైర్మన్ వివరణ
- ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించింది
- పేపర్ల లీకేజీ వ్యవహారం మాకు తెలియదు
- ఈ ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలి
ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షను ప్రభుత్వమే నిర్వహించిందని, ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే స్పష్టత ఇవ్వాలని కోరారు. పేపర్ల లీకేజీ వ్యవహారం తమకు తెలియదని, ఈ పరీక్ష నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ప్రక్రియను తాము నిర్వహించలేదని, గోప్యంగా చేయాల్సిన పనులను సంబంధిత ప్రభుత్వ శాఖలే చేశాయని చెప్పారు.