USA: ‘హౌడీ-మోదీ’ మెగా ఈవెంట్..ఎన్నార్జీ స్టేడియంలో సందడి!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని హూస్టన్ నగరంలో ‘హౌడీ-మోదీ’ కార్యక్రమం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. స్థానిక ఎన్నార్జీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి 650 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. కాసేపట్లో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరుకానున్నారు. కాగా, స్టేడియం బయట భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగితేలారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’, ‘జైహింద్’, ‘మోదీ..మోదీ’ అనే నినాదాలతో మార్మోగింది.
Go Back to Shorts
USA
Houston
‘Howdy-Mody’
Modi
Triump

More Telugu News