తన గారాలపట్టికి శుభాకాంక్షలు చెబుతూ వీడియోను పోస్ట్ చేసిన మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన గారాలపట్టికి శుభాకాంక్షలు చెబుతూ వీడియోను పోస్ట్ చేసిన మహేశ్ బాబు!

  • నేడు 'డాటర్స్ డే'
  • కుమార్తె చిత్రాలతో వీడియో చేసిన మహేశ్
  • ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైరల్
నేడు 'డాటర్స్ డే' కాగా, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, తన గారాల ప‌ట్టి సితార ఫోటోలతో కూడిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. సితార‌ని ప్రాణంగా ప్రేమించే మ‌హేశ్, శుభాకాంక్షలు చెబుతూ, సితార తన ప్రియ‌మైన కొంటె కూతురని, తనను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటానని అన్నారు.

సితార జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.  కాగా, సితార ఇటీవ‌ల సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందులో వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఏ వీడియో పోస్ట్ చేసినా, అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేశ్, "స‌రిలేరు నీకెవ్వ‌రు" అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంది. సితారపై మహేశ్ పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
Mahesh Babu
Sitara
Daughters Day
Wishes

More Telugu News