KTR: వైఎస్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లనే చూశాం... దారితప్పి నాలుగు ఎంపీ సీట్లు గెలిచి హడావుడి చేస్తున్నారు: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ అమలు చేయడంలేదని అన్నారు. దారితప్పి నాలుగు ఎంపీ సీట్లు గెలిచి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి మహామహులనే చూశామని, కేసీఆర్ తప్పుచేసి ఉంటే వాళ్లు వదిలిపెట్టి ఉండేవాళ్లా? అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ కు ఎంతో ఇష్టమని, అందుకే ఆ ఒక్క జిల్లాకే నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
KTR
KCR
BJP
Telangana

More Telugu News