ఈ నెల 24న సమావేశం కానున్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్!
- గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించడంపై చర్చ
- నివేదికలు సమర్పించిన ఇరురాష్ట్రాల ఇంజనీర్లు
- ప్రగతిభవన్ లో జరగనున్న భేటీ
ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ లో ఈ నెల 24న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భేటీలో ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొననున్నారు.