హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. పట్టుబడిన బంగ్లాదేశ్ అమ్మాయిలు
- హైదరాబాద్‌లోని ఛత్రినాకలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
- పట్టుబడిన బంగ్లాదేశ్ యువతులను స్వదేశానికి పంపిన ఎన్ఐఏ
- హైదరాబాద్‌లో ఇటువంటి కేసు ఎన్ఐఏకు ఇదే తొలిసారి
పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ఖాన్-బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులను నగరానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని వారిని స్వదేశానికి పంపారు.
కాగా, ఏప్రిల్‌లో ఛత్రినాకలో వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు ఐదుగురు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కల్పించారు. హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విదేశీ యువతులు పట్టుబడడంతోనే ఎన్ఐఏ కేసు నమోదు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.