నిఘా హెచ్చరికల నేపథ్యంలో.. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో అప్రమత్తత

  • రైళ్లు, రైల్వే స్టేషన్ల లక్ష్యంగా దాడులు జరగొచ్చంటూ ఐబీ హెచ్చరిక
  • భద్రత పెంచాలని నిర్ణయించిన ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్
  • కీలక రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్ తనిఖీలు
ఉగ్రవాదులు దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను, రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రత పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. రైళ్లలో కూడా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.
Go Back to Shorts
IB
Indian Railways
RPF

More Telugu News