తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ.. కారెక్కుతారని ప్రచారం!
- అసెంబ్లీ లాబీలో ఇరువురు నేతల భేటీ
- దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంత చర్చ
- బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్
ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కమలదళంలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని కోమటిరెడ్డి సోదరులు స్పష్టం చేశారు. తాజాగా హరీశ్ రావుతో రాజగోపాల్ రెడ్డి భేటీ నేపథ్యంలో ఇరువురు సోదరులు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.