సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హ్యూమన్ కంప్యూటర్ గా విద్యాబాలన్ 
  • పాన్ ఇండియా కథాంశంతో మహేశ్ చిత్రం
  • కొత్త లగ్జరీ కార్లతో పూరి, చార్మి 
*  హ్యూమన్ కంప్యూటర్ గా పేరుతెచ్చుకున్న ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి జీవిత కథ తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ శకుంతలా దేవిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనుమీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.
*  మహేశ్ బాబు తన మార్కెట్ ను పెంచుకునే క్రమంలో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న మహేశ్ తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా కథాంశంతో రూపొందించనున్నట్టు సమాచారం.
*  'ఇస్మార్ట్ శంకర్' హిట్టుతో ఉత్సాహం మీదున్న దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి తాజాగా కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. పూరి రేంజ్ రోవర్ వోగ్ కారును కొనగా.. చార్మి బీఎం డబ్ల్యూ 7 సీరీస్ కారును కొనడం జరిగింది. 
Vidya Balan
Mahesh Babu
KJF
Charmi

More Telugu News