రేపు విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ప్రకటన
- క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా
- విజయ్ దేవరకొండ జోడీగా రాశి ఖన్నా
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ను వదిలారు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకి ఇది 9వ సినిమా అనే సంగతి తెలిసిందే.