ఈ బానిసలకు మోదీ, షాల కంటే చంద్రబాబే ముఖ్యం!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు
Add ap7am to your home Screen

ఈ బానిసలకు మోదీ, షాల కంటే చంద్రబాబే ముఖ్యం!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

  • ఏపీలో బీజేపీ చీఫ్, కార్యదర్శులు పక్కకు
  • వారి స్థానంలో టీడీపీ ఫిరాయింపు నేతల కంట్రోల్
  • ట్విట్టర్ లో తీవ్రంగా మండిపడ్డ వైసీపీ నేత
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బీజేపీకి సుతిమెత్తటి హెచ్చరిక చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని, కార్యదర్శులను పక్కకు నెట్టిన చంద్రబాబు కోవర్టులు ఇప్పుడు పార్టీపై కంట్రోల్ తీసేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుజనా చౌదరి నేతృత్వంలో మొన్న గవర్నర్ ను కలిసిన బృందాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు.

ఈ బానిసలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ, చంద్రబాబు, సుజనాచౌదరిలను ట్యాగ్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News