నల్లమలలో యురేనియం వ్యతిరేక ఉద్యమం.. జనసైనికులకు ఎమ్మెల్యే రాపాక కీలక సూచన!
- ఉద్యమానికి జనసేన చీఫ్ పవన్ మద్దతు
- డీపీలను మార్చుకోవాలని రాపాక పిలుపు
- ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచన
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో జనసైనికులు అవగాహన కల్పించాలని రాపాక సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తమ డీపీలను ‘సేవ్ నల్లమల’గా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్టర్ లో స్పందించిన రాపాక Stop Uranium Mining, Save Nallamalla అనే ట్యాగ్ లను షేర్ చేశారు.