యరపతినేని కోసమే చంద్రబాబు చిల్లర వేషాలు వేస్తున్నాడు!: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

యరపతినేని కోసమే చంద్రబాబు చిల్లర వేషాలు వేస్తున్నాడు!: విజయసాయిరెడ్డి

  • గతేడాది బాబు మనుషులపై ఐటీ, ఈడీ దాడులు
  • మోదీని గద్దె దింపుతా అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాటల దాడి కొనసాగుతోంది. గతేడాది తన వాళ్లపై ఐటీ శాఖ, ఈడీ అధికారులు కేసులు పెట్టగానే చంద్రబాబు ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మోదీని గద్దె దింపుతా’ అని వార్నింగులు ఇచ్చేవాడని సాయిరెడ్డి విమర్శించారు.

ఇప్పుడు యరపతినేని శ్రీనివాసరావు కేసు సీబీఐ చేతికి వెళుతోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలెట్టాడని దుయ్యబట్టారు. పల్నాడులో టీడీపీ హయాంలో జరిగిన అరాచకాలు బయటకు రాకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News