విపరీతమైన తలనొప్పి వస్తోందని... 15 మాత్రలు మింగిన మహిళ మృతి!
- బెంగళూరులో ఘటన
- డాక్టర్ రాసిన మాత్రలను ఒకేసారి వేసుకున్న మహిళ
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
విపరీతంగా తలనొప్పి వస్తోందంటూ, ఆమె ఆ మాత్రలన్నీ ఒకేసారి వేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను గమనించిన కుమార్తె శోభ, హుటాహుటిన సమీపంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అసహజ మరణం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.