విక్రమ్ తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం: ఇస్రో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విక్రమ్ తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం: ఇస్రో

  • ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో విక్రమ్
  • పక్కకు ఒరిగిందే తప్ప చెక్కుచెదరలేదు
  • వెల్లడించిన ఇస్రో శాస్త్రవేత్తలు
చంద్రునిపై దిగే సమయంలో కమ్యూనికేషన్‌ కోల్పోయిన విక్రమ్‌ ల్యాండర్‌ ఎక్కడుందో గుర్తించడం జరిగిందని, అది ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పక్కకు ఒరిగి ఉందని ఇస్రో పేర్కొంది. విక్రమ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని, దానితో సంబంధాలు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ప్రకటన వెలువరించింది.

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో భాగంగా, 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలంపై హార్డ్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ను చంద్రుని వద్దకు తీసుకు వెళ్లిన ఆర్బిటర్‌ సాయంతో జాడ కనుగొన్నామని ఆదివారం నాడు ప్రకటించిన ఇస్రో, దాన్ని మరోసారి ధ్రువీకరించింది.

ఆన్‌ బోర్డ్‌ కెమెరాల సాయంతో విక్రమ్‌ ల్యాండర్‌ ను గుర్తించామని, ఇదే సమయంలో దానితో ఎటువంటి కమ్యూనికేషన్‌ జరగడం లేదని తెలిపింది. సంబంధాలు పునరుద్ధరించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది.
Vikram
ISRO
Chandrayaan-2

More Telugu News