మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ లో 'సాహో' చిత్రాన్ని వీక్షించిన ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ లో 'సాహో' చిత్రాన్ని వీక్షించిన ప్రభాస్

  • ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో
  • ప్రభాస్ కు స్వాగతం పలికిన ఏఎండీ సినిమాస్ యాజమాన్యం
  • ప్రభాస్ ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు
హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఆలిండియా లెవల్లో హైప్ అందుకున్న చిత్రం 'సాహో'. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తోనే రూ.400 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. తాజాగా, 'సాహో' చిత్రాన్ని ప్రభాస్ హైదరాబాద్ లో వీక్షించారు. టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుకు చెందిన 'ఏఎంబీ సినిమాస్' మల్టీప్లెక్స్ లో 'సాహో'ను తిలకించారు. ప్రభాస్ వస్తున్నట్టు ముందుగానే తెలియడంతో థియేటర్ యాజమాన్యం 'వెల్ కమ్ రెబెల్ స్టార్ ప్రభాస్' అంటూ పెద్ద డిస్ ప్లే బోర్టు ఏర్పాటు చేసింది. ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
Saaho
Prabhas
Mahesh Babu

More Telugu News