గోదావరి వరద ఉద్ధృతి.. ఏపీలో నాలుగు రోజులుగా 36 గ్రామాలకు నిలిచిన రాకపోకలు!
- అంతకంతకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
- జలదిగ్బంధంలో దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి తదితర గ్రామాలు
- నీట మునిగిన 200కు పైగా ఇళ్లు
ఆదివారం రంపచోడవరంలో పర్యటించిన ఆర్డీవో శ్రీనివాసరావుపై బాధిత గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తమకు తిండిలేదని, అధికారులు భోజన ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నేడు (సోమవారం) వరద ముప్పు గ్రామాల్లో 2500 కుటుంబాలకు ఉదయం టిఫిన్‌తోపాటు రెండు పూటలా భోజనం అందిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.