మీరే మా నిజమైన హీరోలు... చంద్రయాన్-2లో పాలుపంచుకున్న సైంటిస్టులకు మహేశ్ బాబు సెల్యూట్

  • చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రోకు అభినందనలు
  • మీ వెంట మేమున్నాం అంటూ ఇస్రో సైంటిస్టులకు మహేశ్ బాబు సంఘీభావం
  • మహర్షి డైలాగ్ ను ట్వీట్ చేసిన సూపర్ స్టార్
చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రో శాస్త్రవేత్తల కృషికి దేశవ్యాప్తంగా నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా, టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఇస్రో సైంటిస్టులకు సెల్యూట్ చేశారు. "మీరే మా నిజమైన కథానాయకులు. మీ వెంటే మేమున్నాం. మీలో ప్రతి ఒక్కరికీ వందనం చేస్తున్నా. ఇది మీ విజయగాథకు ఆరంభం మాత్రమే. మున్ముందు మరెంతో సాధించాల్సి ఉంది" అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా మహేశ్ బాబు తన మహర్షి చిత్రంలోని పాప్యులర్ డైలాగును కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. "విజయం ఓ గమ్యం కాదు, అదొక ప్రయాణం (సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ)" అంటూ సైంటిస్టులకు ప్రోత్సాహ వచనాలు పలికారు.
Go Back to Shorts
Mahesh Babu
ISRO
Chandrayaan-2

More Telugu News