గుంటూరులో శాడిస్టు వడ్డీవ్యాపారి.. ‘స్పందన’ ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు!
- గుంటూరులోని కొత్తపేటలో ఘటన
- ప్రజలను వేధిస్తున్న వడ్డీ వ్యాపారి రత్నారెడ్డి
- 225 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కొత్తపేట సీఐ సుధాకర్ రెడ్డి.. సుధాకర్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రత్నారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రత్నారెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విస్తుపోయారు. అతని ఆఫీసు నుంచి 225 ఏటీఎం కార్డులు, రూ.1.40 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 పాస్ పుస్తకాలు, 102 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 ఖాళీ చెక్కులు, 8 పట్టాదారు పాస్ పుస్తకాలు, 20 దస్తావేజులు రత్నారెడ్డి ఆఫీసులో లభించాయి.