రేపు గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు... మరపురాని ఏర్పాట్లు చేయాలన్న కేసీఆర్!
- తొలుత రాజ్ భవన్ లో వీడ్కోలు కార్యక్రమం
- అనంతరం ఎయిర్ పోర్టులో గంటపాటు సాగనున్న వీడ్కోలు సత్కారం
- కొత్త గవర్నర్ గా 8న తమిళిసై బాధ్యతల స్వీకరణ
నరసింహన్ కు మరపురాని వీడ్కోలును అందించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. తొలుత రాజ్ భవన్ లో వీడ్కోలు సత్కారం అనంతరం నరసింహన్ ఫ్యామిలీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికేందుకు సీఎం సహా, మంత్రులంతా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. వీడ్కోలు కార్యక్రమం సుమారు గంట పాటు సాగుతుందని సమాచారం. ఆపై 7 గంటల సమయంలో ఆయన చెన్నైకి బయలుదేరి వెళతారు.